శరత్‌కుమార్‌, రాధారవిని అరెస్టు చేయండి: హైకోర్టు

Madras High Court Orders Against Actor Sarath Kumar - Sakshi

సాక్షి, చెన్నై: ప్రముఖ నటులు శరత్‌కుమార్‌, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నడిగర్‌ సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top