డాక్ట‌ర్ల‌కు డెడ్‌లైన్ విధించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్

Madhya Pradesh Government Gives Deadline Doctors To Reach Indore - Sakshi

ఇండోర్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాజ‌ధాని ఇండోర్ క‌రోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. రాష్ట్ర‌వ్యాప్తంగా న‌మోదైన కేసుల్లో స‌గానికిపైగా ఒక్క ఇండోర్‌లోనే న‌మోద‌వుతుండ‌టం అక్క‌డి అధికారుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా విజృంభిస్తున్న ఈ న‌గ‌రంలో మరింత‌మంది వైద్యుల అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌భుత్వం అభిప్రాయ‌ప‌డింది. ఈ క్ర‌మంలో 32 మంది సీనియ‌ర్ డాక్ట‌ర్ల‌తో పాటు మ‌రో 70 మంది వైద్యులను ఇండోర్‌కు వెళ్లాల్సిందిగా ఏప్రిల్ 11న‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే బుధ‌వారం నాటికి కొంత‌మంది వైద్యులు మాత్ర‌మే ఇండోర్‌కు చేరుకున్నారు. మిగ‌తావారు అక్క‌డి కోవిడ్‌-19 ఆసుప‌త్రుల్లో సేవ‌లందించేందుకు నిరాక‌రించారు. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెంట‌నే ఇండోర్‌కు వెళ్లాల్సిన వైద్యుల జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఉన్న వైద్యులంద‌రూ శుక్ర‌వారం సాయంత్రం ఐదు గంట‌ల ముప్పై నిమిషాల‌లోపు అక్క‌డికి చేరుకోవాల‌ని డెడ్‌లైన్ విధించింది. (లాక్‌డౌన్‌: ఉండలేం.. ఊరెళ్లిపోతాం!)

అయిన‌ప్ప‌టికీ విధుల‌కు వెళ్ల‌డానికి నిరాక‌రిస్తే స‌ద‌రు డాక్ట‌ర్ల‌పై ఎస్మా నిబంధ‌న‌ల ఉల్లంఘన కింద క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కాగా క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో ఏప్రిల్ 8న అత్య‌వ‌స‌ర సేవ‌ల నిర్వ‌హ‌ణ చ‌ట్టం(ఎస్మా) విధించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో వైద్యం, అంబులెన్స్ సేవ‌లు, ఔష‌ధాల కొనుగోలు- స‌ర‌ఫ‌రా,  నీటి స‌ర‌ఫ‌రా, విద్యుత్, ఆహారం, తాగు నీరు, ర‌క్ష‌ణ‌కు సంబంధించిన ప‌ది సేవ‌లు ఈ చ‌ట్టం ప‌రిధిలోకి వ‌స్తాయి. బుధ‌వారం నాటికి రాష్ట్రంలో 987 క‌రోనా కేసులు న‌మోదు కాగా, ఒక్క ఇండోర్‌లోనే కేసుల సంఖ్య‌ 544కు చేరింది. (హైదరాబాద్‌ తర్వాత ఇక్కడే ఎక్కువ..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top