కర్రతో ఈవ్‌ టీజర్లపై శివంగిలా యువతి దూకి.. | Lucknow Woman Borrows Stick to Thrash Eve-teasers | Sakshi
Sakshi News home page

కర్రతో ఈవ్‌ టీజర్లపై శివంగిలా యువతి దూకి..

Mar 20 2017 7:24 PM | Updated on Jul 11 2019 8:06 PM

కర్రతో ఈవ్‌ టీజర్లపై శివంగిలా యువతి దూకి.. - Sakshi

కర్రతో ఈవ్‌ టీజర్లపై శివంగిలా యువతి దూకి..

వేధింపులకు గురిచేయాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులకు ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. శివంగిలా వారిపై దూకి దుమ్ము దులిపింది.

లక్నో: వేధింపులకు గురిచేయాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులకు ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. శివంగిలా వారిపై దూకి దుమ్ము దులిపింది. ఎంతలా అంటే ఆమె కోపానికి భయపడి ఏ ఒక్కరు ఆమెను ఆపే సాహసం చేయలేదు. వివరాల్లోకి వెళితే..లక్నోలో స్కూటర్‌పై ఓ యువతి వెళుతుండగా బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను ఫాలో అవుతూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు.

అనకూడని మాటలు అన్నారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువతి వెంటనే తన స్కూటీని ఆపేసి ఓ సెక్యూరిటీ గార్డు నుంచి కర్ర లాగేసుకుని వాళ్లను చిత్తుగా కొట్టింది. ఆమె దాడి చేసే తీరు చూసి భయంతో ఏ ఒక్కరు కూడా ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. వారిని చితక్కొట్టిన ఆ యువతి అనంతరం మహిళా పోలీసుల హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1090కు ఫోన్‌ చేసి వారిని పట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement