breaking news
girl thrashes
-
కర్రతో ఈవ్ టీజర్లపై శివంగిలా యువతి దూకి..
లక్నో: వేధింపులకు గురిచేయాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులకు ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. శివంగిలా వారిపై దూకి దుమ్ము దులిపింది. ఎంతలా అంటే ఆమె కోపానికి భయపడి ఏ ఒక్కరు ఆమెను ఆపే సాహసం చేయలేదు. వివరాల్లోకి వెళితే..లక్నోలో స్కూటర్‌పై ఓ యువతి వెళుతుండగా బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను ఫాలో అవుతూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. అనకూడని మాటలు అన్నారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువతి వెంటనే తన స్కూటీని ఆపేసి ఓ సెక్యూరిటీ గార్డు నుంచి కర్ర లాగేసుకుని వాళ్లను చిత్తుగా కొట్టింది. ఆమె దాడి చేసే తీరు చూసి భయంతో ఏ ఒక్కరు కూడా ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. వారిని చితక్కొట్టిన ఆ యువతి అనంతరం మహిళా పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్ 1090కు ఫోన్ చేసి వారిని పట్టించింది. -
చెప్పుతో ఎడాపెడా వాయించేసింది..
-
చెప్పుతో ఎడాపెడా వాయించేసింది..
భోపాల్: ఆకతాయిలు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. ఈ వేధింపులను చాలామంది యువతులు, మహిళలు మౌనంగా సహిస్తారే తప్ప, ఫిర్యాదు దాకా వెళ్లరు. గొడవెందుకులే అని మిన్నకుండిపోయేవాళ్లే ఎక్కువమంది. కానీ ఆ సంఘటన, ఆ అవమానం మళ్ళీ మళ్లీ గుర్తొచ్చి మనసును బాధిస్తూనే ఉంటుంది. అయితే ఆకతాయిల చేష్టలు శ్రుతిమించితే ఒక్కోసారి చిర్రెత్తుకొస్తుంది. అలాంటప్పుడు వాళ్లు చేతికి చిక్కితేనా అనిపిస్తుంది కదా... అలా చేతికి చిక్కిన కాదు..కాదు.. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఈవ్ టీజర్లను దొరకబుచ్చుకుని మరీ ఉతికి ఆరేసిందో యువతి. మధ్యప్రదేశ్ తికాంగ్రా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెకిలి చేష్టలతో వేధిస్తున్న ఇద్దరు యువకులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకొచ్చారు. ఆకతాయిలను చూడగానే ఆవేశంగా రగిలిపోయిన ఆ యువతి చెప్పుతో ఎడాపెడా వాయించేసింది. పోలీసుల సమక్షంలోనే ఇద్దరినీ ఉతికి ఆరేసింది. ఈ వీడియో ఇపుడు నెట్లో హల్చల్ చేస్తోంది.