ఆకతాయిలు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. ఈ వేధింపులను చాలామంది యువతులు, మహిళలు మౌనంగా సహిస్తారే తప్ప, ఫిర్యాదు దాకా వెళ్లరు. గొడవెందుకులే అని మిన్నకుండిపోయేవాళ్లే ఎక్కువమంది. కానీ ఆ సంఘటన, ఆ అవమానం మళ్ళీ మళ్లీ గుర్తొచ్చి మనసును బాధిస్తూనే ఉంటుంది.