టాప్‌–40 బిజినెస్‌ స్కూళ్లలో ఎల్‌పీయూ | LPU Mittal School of Business among top 40 B-schools | Sakshi
Sakshi News home page

టాప్‌–40 బిజినెస్‌ స్కూళ్లలో ఎల్‌పీయూ

Apr 7 2018 3:47 AM | Updated on Apr 7 2018 3:47 AM

 LPU Mittal School of Business among top 40 B-schools - Sakshi

జలంధర్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)ర్యాంకింగ్‌లలో లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ మిట్టల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ దేశంలోని టాప్‌–40 బిజినెస్‌ స్కూళ్లలో ఒకటిగా నిలిచింది. ఎల్‌పీయూ ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌ 26వ స్థానంలో నిలిచింది.

మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. పంజాబ్‌ యూనివర్సిటీ, ఐఐఎం రాంచీ, బిట్స్‌ లాంటి ఉన్నత విద్యా సంస్థలను అధిగమించి ఎల్‌పీయూ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ పంజాబ్‌ రీజియన్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. ‘ఔట్‌రీచ్‌ అండ్‌ ఇంక్లూజివిటీ’ విభాగంలో అన్ని ఐఐఎంలను దాటుకుని తొలిస్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement