
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పాకిస్తాన్‌ను పొగడ్తలతో ముంచెత్తడంపై ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. ‘మోదీ గారూ.. త్వరపడండి. చూస్తుంటే ట్రంప్‌కు మీ కౌగిలి మరోసారి అవసరమైనట్లుంది’ అని ట్వీటర్‌లో వ్యాఖ్యానించారు. దీంతో పాటు పాక్‌ను ప్రశంసిస్తూ ట్రంప్ చేసిన ట్వీట్ ఫొటోను కూడా ఈ వ్యాఖ్యలకు జతచేశారు. గతంలో అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ట్రంప్‌ను ఆత్మీయంగా కౌగిలించుకోవడాన్ని గుర్తుచేస్తూ ఈ మేరకు చురకలంటించారు.