కలకలం రేపుతున్న ఉగ్రవాది వీడియో | Lashkars Naveed Jutt Emerges With Hizbul Terrorists | Sakshi
Sakshi News home page

కలకలం రేపుతున్న ఉగ్రవాది వీడియో

Mar 2 2018 6:22 PM | Updated on Mar 2 2018 8:37 PM

Lashkars Naveed Jutt Emerges With Hizbul Terrorists - Sakshi

తుపాకులతో వీడియోకు పోజులిస్తున్న లష్కరే ఉగ్రవాది నవీద్‌ జట్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది సమీర్‌ టైగర్‌

సాక్షి, న్యూఢిల్లీ : కొత్తగా బయటకు వచ్చిన కరడుగట్టిన ఉగ్రవాది వీడియో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత నెలలో శ్రీనగర్‌ ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన పాకిస్థాన్‌ ఉగ్రవాది నవీద్‌ జట్‌ తాజగా ఆ వీడియోలో కనిపించాడు. అది కూడా జమ్ముకశ్మీర్‌లో ప్రభావం ఉన్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ సమీర్‌ టైగర్‌ మరో ఐదుగురితో కలిసి ఉండి. దీని ప్రకారం పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలతో కలిసి హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కలిసి పనిచేస్తుందని మరోసారి స్పష్టమైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వీడియో దక్షిణ కశ్మీర్‌లోని ఏదో ఒక ప్రాంతంలో ఆ వీడియోను తీసి ఉంటారు. నవీద్‌ తప్పించుకున్న ఘటనపై పోలీసులు విచారించగా అతడిని తప్పించేందుకు గత నాలుగు నెలల కిందటే ప్రణాళికలు సిద్ధం చేసి ఉగ్రవాదులు అమలు చేసినట్లు, దానికి హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సాయం చేసినట్లు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో మొత్తం ఐదు నుంచి ఆరు మంది ఉన్నారు. వారందరి చేతుల్లో కూడా ఆయుధాలు ఉన్నాయి. నవీద్‌ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement