మసీదులోకి మహిళల ఎంట్రీకీ ఓకే! | Sakshi
Sakshi News home page

మసీదులోకి మహిళల ఎంట్రీకీ ఓకే!

Published Mon, Apr 25 2016 1:08 PM

మసీదులోకి మహిళల ఎంట్రీకీ ఓకే!

తిరువనంతపురం: కేరళలోని  ఓ ప్రసిద్ధ  మసీదు ఓ చారిత్రక పరిణామానికి నాందిగా నిలిచింది. మసీదులోకి ప్రవేశానికి  ముస్లిం మహిళలకు మొదటిసారి అనుమతి లభించింది. ప్రసిద్ధ  తజతంగడి జుమ్మా మసీదు  లో మొట్టమొదటిసారిగా  కమిటీ  తీసుకున్న  నిర్ణయంతో ముస్లిం మహిళలు  కూడా  ప్రార్థనలు చేసుకునే అవకాశం కలిగింది.  ఈ మేరకు ముస్లిం  పెద్దలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.   "తాజ్ జుమ మసీద్ " గా  ప్రసిద్ధి చెందిన ఈ మసీదులోకి మహిళల  ప్రవేశానికి  ద్వారాలు తెరుస్తూ మసీదు కమిటీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల సాంప్రదాయానికి చరమ గీతం పాడుతూ   మసీదు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం  వ్యక్త మవుతోంది.  స్థానిక ముస్లిం కార్యకర్తలు నిరంతర ప్రచారం , ఉద్యమం తర్వాత  ఈ  ఘన విజయాన్ని సాధించారు

కాగా మీనచిల్ నది ఒడ్డున కొట్టాయం కు సమీపంలో ఉన్న ఈ మసీదు భారత దేశంలోని అత్యంత పురాతనమైన మసీదులలో ఒకటి.1000 సంవత్సరాల కంటే ప్రాచీనమైన  ఇది నిర్మాణ శోభకు,కొయ్య చెక్కడాలలో అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ అనుచరులచే కేరళకు వారి మొదటి ప్రయాణాల సందర్భంగా నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement