కోలీవుడ్‌లో కీర్తి | keerthi in Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో కీర్తి

Oct 26 2014 12:02 AM | Updated on Sep 2 2017 3:22 PM

కోలీవుడ్‌లో కీర్తి

కోలీవుడ్‌లో కీర్తి

అమ్మాయి బాగుంది. అభినయం ఓకే. ఇక ఆ నటి ఏ ప్రాంతానికి చెందిందన్న విషయం గురించి సినిమా వర్గాలు ఆలోచించవు. ముఖ్యంగా ఏ ముద్దుగుమ్మనైనా కోలీవుడ్ అక్కున చేర్చుకుంటుంది.

అమ్మాయి బాగుంది. అభినయం ఓకే. ఇక ఆ నటి ఏ ప్రాంతానికి చెందిందన్న విషయం గురించి సినిమా వర్గాలు ఆలోచించవు. ముఖ్యంగా ఏ ముద్దుగుమ్మనైనా కోలీవుడ్ అక్కున చేర్చుకుంటుంది. తాజాగా మలయాళ నటి కీర్తి సురేష్‌కు కోలీవుడ్‌లో డిమాండ్ పెరుగుతోంది. మలయాళంలో ఇప్పటికే పలు చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ తమిళంలో విక్రమ్ ప్రభు సరసన నటించే అవకాశం లభించింది. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తొలి చిత్రం నిర్మాణంలో ఉండగానే కీర్తికి మరో అవకాశం తలుపు తట్టింది.
 
 శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. వరుత్త పడాద వాలిబర్ సంఘం వంటి విజయవంతమైన చిత్రం తరువాత దర్శకుడు పొన్‌రాయ్, శివకార్తికేయన్ కలయికలో రూపొందనున్న రెండో చిత్రం రజనీ మురుగన్. ఈ చిత్రంలో నయనతారను హీరోయిన్‌గా నటింప చేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి ఫలించలేదు. ఆ తరువాత నటి లక్ష్మీమీనన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. దర్శకుడు లింగుస్వామి చిత్ర నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
 
 కీర్తి సురేష్‌కు ప్రముఖ నటి అనుష్క బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారట. ఈ విషయాన్ని కీర్తి తల్లి సీనియర్ మలయాళ నటి మేనక తెలిపారు. కీర్తి సురేష్ పుట్టిన రోజు వేడుకను దర్శకుడు విజయ్ ఇటీవల తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారట. ఆ సమయంలో ఆయన కీర్తితో మీకో సర్‌ప్రైజ్ విషెస్ అంటూ ఫోన్ ఇచ్చారట. ఫోన్‌లో నటి అనుష్క బెస్ట్ విషెస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ సర్‌ప్రైజ్ చేశారట. అంత గొప్ప నటి తనతో మాట్లాడటంతో కీర్తి ఆనందానికి అవధులు లేకపోయాయట. ఈ విషయాన్ని ఆమె తల్లి మేనక వెల్లడించారు. అంతేకాదు కీర్తికి కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు ఆమె తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement