బాహ్య ప్రపంచంలోకి కరుణ | Karunanidhi Gives Rare 'Darshan' to DMK Cadre | Sakshi
Sakshi News home page

బాహ్య ప్రపంచంలోకి కరుణ

Oct 21 2017 3:11 AM | Updated on Oct 21 2017 3:11 AM

Karunanidhi Gives Rare 'Darshan' to DMK Cadre

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏడాదికిపైగా ఇంటికే పరిమితమైన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి(93) గురువారం బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఏడాదిగా ఎవరినీ కలవడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరుకావడం లేదు.

కరుణానిధి సోదరి భర్త మురసోలిమారన్‌ తన పేరుతో పెట్టిన పార్టీ పత్రిక ‘మురసొలి’ 75 వ వార్షికోత్సవ వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకూ కరుణ రాలేదు. ఈ సందర్భంగా కోడంబాక్కంలోని పత్రిక కార్యాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు గురువారం రాత్రి కరుణానిధి కార్యాలయానికి వచ్చారు. ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన కరుణానిధి మైనపు బొమ్మను ఆయన ఆసక్తిగా తిలకించి విజిటర్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేశారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ కరుణ వెంట వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement