ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు.. ఓ వ్యక్తి అరెస్టు! | Karnataka man arrested for Facebook post on Tipu Sultan | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు.. ఓ వ్యక్తి అరెస్టు!

Jan 26 2016 1:11 PM | Updated on Oct 9 2018 5:39 PM

ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు.. ఓ వ్యక్తి అరెస్టు! - Sakshi

ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు.. ఓ వ్యక్తి అరెస్టు!

మైసూర్‌ రాజు టిప్పూ సుల్తాన్‌ గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిని కర్ణాటక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

బెంగళూరు: మైసూర్‌ రాజు టిప్పూ సుల్తాన్‌ గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిని కర్ణాటక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మధ్య కర్ణాటకలోని కొప్పల పట్టణానికి చెందిన మంజునాథ్ ముద్గల్ ఐటీఐ విద్యార్థి. అతను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో టిప్పూ సుల్తాన్‌ ఫొటోలు పెట్టి.. ఆయనను అవమానపరిచే వ్యాఖ్యలు చేశాడు.

గతంలోనూ అతను ముస్లిం రాజైన టిప్పూ సుల్తాన్ ఫొటోలు అభ్యంతరకరంగా పోస్టు చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఇది స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని భావించిన పోలీసులు మంజునాథ్‌ను అరెస్టు చేశారు. ఫేస్‌బుక్ అకౌంట్‌లోని ఫొటోలన్నింటినీ తొలగించాలని అతన్ని ఆదేశించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement