లాక్‌డౌన్‌: కర్ణాటక కీలక నిర్ణయం

Karnataka Likely To Open Gyms Fitness Centres Post May 17 - Sakshi

బెంగళూరు: లాక్‌డౌన్‌ మూడో దశ గడువు మే 17 నాటితో ముగియనున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్నాళ్లు మూతపడిన జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, గోల్ఫ్‌ కోర్సులు తెరిచేందుకు అనుమతించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, క్రీడా మంత్రిత్వ శాఖా మంత్రి సీటీ రవి బుధవారం మాట్లాడుతూ... ‘‘ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యాను. లాక్‌డౌన్‌తో మూతపడిన జిమ్‌, ఫిట్‌నెస్‌ సెంటర్లు, గోల్ఫ్‌కోర్సులను తిరిగి ప్రారంభించే అంశం గురించి చర్చించాను. అదే విధంగా పర్యాటక రంగం పూర్వస్థితికి చేరుకోవడానికి.. భౌతిక దూరం పాటిస్తూ పర్యాటకులను అనుమతించాలని విన్నవించాను. హోటళ్లు తెరిచే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరాను’’ అని తెలిపారు.(జిల్లా సరిహద్దులు తెరిచే అవకాశం లేదు..)

ఈ క్రమంలో మే 17 తర్వాత నిబంధనలు పాటిస్తూ జిమ్‌లు తెరిచేందుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని రవి పేర్కొన్నారు. ఇక గోల్ఫ్‌కోర్సుల విషయంలో గోల్పర్స్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లయితే ఆ అంశాన్ని పరిశీలిద్దామని తనతో చెప్పారన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పర్యాటక రంగం భారీగా నష్టపోయిన దృష్ట్యా.. ‘‘లవ్‌ యువర్‌ నేటివ్‌’’ కాన్సెప్ట్‌తో స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా అంతర్‌జిల్లా, అంతర్‌రాష్ట్ర, విదేశీ పర్యాటకులకు అనుమతినిస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ఆధారంగా వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని రవి తెలిపారు. (లాక్‌డౌన్‌ 4.0 : మోదీ కీలక భేటీ)

ఈపీఎఫ్‌: 3 నెలలు పొడిగింపు.. రూ. 2500 కోట్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top