breaking news
Golf courses
-
జిమ్, ఫిట్నెస్ సెంటర్లకు అనుమతులు!
బెంగళూరు: లాక్డౌన్ మూడో దశ గడువు మే 17 నాటితో ముగియనున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్నాళ్లు మూతపడిన జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు తెరిచేందుకు అనుమతించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, క్రీడా మంత్రిత్వ శాఖా మంత్రి సీటీ రవి బుధవారం మాట్లాడుతూ... ‘‘ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యాను. లాక్‌డౌన్‌తో మూతపడిన జిమ్, ఫిట్నెస్ సెంటర్లు, గోల్ఫ్‌కోర్సులను తిరిగి ప్రారంభించే అంశం గురించి చర్చించాను. అదే విధంగా పర్యాటక రంగం పూర్వస్థితికి చేరుకోవడానికి.. భౌతిక దూరం పాటిస్తూ పర్యాటకులను అనుమతించాలని విన్నవించాను. హోటళ్లు తెరిచే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరాను’’ అని తెలిపారు.(జిల్లా సరిహద్దులు తెరిచే అవకాశం లేదు..) ఈ క్రమంలో మే 17 తర్వాత నిబంధనలు పాటిస్తూ జిమ్‌లు తెరిచేందుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని రవి పేర్కొన్నారు. ఇక గోల్ఫ్‌కోర్సుల విషయంలో గోల్పర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లయితే ఆ అంశాన్ని పరిశీలిద్దామని తనతో చెప్పారన్నారు. లాక్డౌన్ కారణంగా పర్యాటక రంగం భారీగా నష్టపోయిన దృష్ట్యా.. ‘‘లవ్ యువర్ నేటివ్’’ కాన్సెప్ట్‌తో స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర, విదేశీ పర్యాటకులకు అనుమతినిస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ఆధారంగా వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని రవి తెలిపారు. (లాక్డౌన్ 4.0 : మోదీ కీలక భేటీ) ఈపీఎఫ్: 3 నెలలు పొడిగింపు.. రూ. 2500 కోట్లు -
హోల్ నంబర్ 14..
అన్ని గోల్ఫ్ కోర్సులు ఒక ఎత్తు.. అమెరికాలోని ఇడాహోలో ఉన్న లేక్ కొయిర్ డిఅలెనె గోల్ఫ్ కోర్సు ఒక ఎత్తు. ఈ గోల్ఫ్ కోర్సులో మొత్తం 18 హోల్స్ ఉన్నాయి. అయితే.. 14వ దాన్లోకి బాల్ కొట్టాలంటే.. కొంచెం కష్టమైన పనే.. తేడా వస్తే.. మరి గోల్ఫ్ బాల్ మీ కంటికి కనిపించదు. బుడుంగుమని మునిగిపోతుంది. ఒకవేళ సరిగ్గా కొట్టినా.. దాని వద్దకు పోవాలంటే.. బోటు ఎక్కాల్సిందే. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే గోల్ఫ్ కోర్స్. ఓ సరస్సుపై దీన్ని నిర్మించారు. అంతేకాదు.. ఇది కదులుతుంది కూడా.. ఆటను బట్టి దీని దూరాన్ని సరిచేసుకోవచ్చు. ఈ గోల్ఫ్ కోర్సులో 14వ హోల్ ఉన్న దాన్ని నీటిపై తేలియాడే విధంగా కట్టారు. ఇది అండర్ వాటర్ కేబుల్ ద్వారా కదులుతుంది. కంప్యూటర్ ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.