భారీ వర్షాలు : హై అలర్ట్‌కు ఆదేశించిన ముఖ్యమంత్రి | Karnataka Heavy Rains Red Alert In Districts | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు : హై అలర్ట్‌కు ఆదేశించిన ముఖ్యమంత్రి

Aug 15 2018 6:20 PM | Updated on Aug 15 2018 6:33 PM

Karnataka Heavy Rains Red Alert In Districts - Sakshi

వరద నీటితో మునిగిన ప్రాంతం, మాట్లాడుతున్న హెచ్‌డీ కుమారస్వామి

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి  హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందనే సమాచారంతో కొడగు, దక్షిణ కన్నడ, హాసన్‌, చిక్‌మంగళూరు,శివమెగ్గ జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించిన ఆయన సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. మంత్రులు సైతం ఎప్పటికప్పుడు జిల్లాల్లోని పరిస్థితులను సమీక్షిస్తుండాలని కోరారు. కర్ణాటకలో గత కొద్ది రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.

గడిచిన 24గంటల్లో ఉడిపి జిల్లాలో 35.7 సెంటీమీటర్ల అ‍త్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో అధికారులు అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అరేబియా సముద్ర తీరం వెంట బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement