జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం | Journalist gangraped in Uttar pradesh | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం

Mar 28 2014 5:04 PM | Updated on Sep 2 2017 5:18 AM

ఉత్తరప్రదేశ్లో దారుణ సంఘటన జరిగింది. వింధ్యాచల్ ప్రాంతంలో ఓ మహిళా జర్నలిస్టు (30) పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

మీర్జాపూర్: ఉత్తరప్రదేశ్లో దారుణ సంఘటన జరిగింది. వింధ్యాచల్ ప్రాంతంలో ఓ మహిళా జర్నలిస్టు (30) పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు అష్టభుజ కొండకు వెళ్తుండగా ఆమెపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు వింధ్యాచల్ రేంజి డీఐజీ ఆర్కే శ్రీవాత్సవ చెప్పారు. అతని వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement