జేఎన్‌యూలో అధ్యాపకుడి లైంగిక వేధింపులు | JNU students allege sexual harassment by professor, who denies | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూలో అధ్యాపకుడి లైంగిక వేధింపులు

Mar 20 2018 3:10 AM | Updated on Oct 5 2018 9:09 PM

JNU students allege sexual harassment by professor, who denies - Sakshi

పోలీస్‌స్టేషన్‌ వద్ద నినాదాలిస్తున్న జేఎన్‌యూ విద్యార్థినులు

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్న అతుల్‌ జోహ్రి అనే అధ్యాపకుడిని పోలీసులు రక్షిస్తున్నారంటూ ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు వసంత్‌ కుంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. జోహ్రి తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎనిమిది మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల అనంతరం కూడా పోలీసులు కేవలం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వదిలేశారనీ, కనీసం ఆయనను విచారించలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. ఎనిమిది మంది విద్యార్థినుల ఫిర్యాదులపై వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని 54 మంది అధ్యాపకులు కూడా పోలీసులను డిమాండ్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement