దూసుకుపోతున్న తండ్రీకొడుకులు | Jitan Ram Manjhi leading in bihar assembly elections | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న తండ్రీకొడుకులు

Nov 8 2015 10:01 AM | Updated on Jul 18 2019 2:11 PM

దూసుకుపోతున్న తండ్రీకొడుకులు - Sakshi

దూసుకుపోతున్న తండ్రీకొడుకులు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమామ్ గంజ్, ముఖ్దుంపూర్ నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న బీజేపీ పార్టీ భాగస్వామి హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ ముందంజలో దూసుకు పోతున్నారు.

పట్నా:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఇమామ్ గంజ్, ముఖ్దుంపూర్ నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న బీజేపీ పార్టీ భాగస్వామి హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ ముందంజలో దూసుకు పోతున్నారు. అలాగే ఆయన కుమారుడు సంతోష్ సుమన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు.

 

సంతోష్ సుమన్ కుతుంబా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.  ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. రాఘోపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తేజస్వి ...ముందుగా ఆధిక్యంలో కొనసాగినా... ఆ తర్వాత వెనకబడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement