14 నుంచి వెబ్‌సైట్‌లో జేఈఈ హాల్‌టికెట్లు | JEE Main 2017 admit card by CBSE can be download | Sakshi
Sakshi News home page

14 నుంచి వెబ్‌సైట్‌లో జేఈఈ హాల్‌టికెట్లు

Mar 9 2017 8:44 PM | Updated on Sep 5 2017 5:38 AM

14 నుంచి వెబ్‌సైట్‌లో జేఈఈ హాల్‌టికెట్లు

14 నుంచి వెబ్‌సైట్‌లో జేఈఈ హాల్‌టికెట్లు

జేఈఈ మెయిన్‌ పరీక్షల హాల్‌ టికెట్లు ఈనెల 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌:
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో, కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇతర ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షల హాల్‌ టికెట్లు ఈనెల 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెల 2న ఆఫ్‌లైన్‌లో, 8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించే జేఈఈ మెయిన్‌కు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు 14వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) వెల్లడించింది.

ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఈ అంశాన్ని చేర్చింది. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ నుంచి 70 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement