అమ్మ ఆరోగ్యం: తమిళ టీవీ చానల్ షేర్ల లాభాలు | jayalalitha's health: tamil TV channel shares shines | Sakshi
Sakshi News home page

అమ్మ ఆరోగ్యం: తమిళ టీవీ చానల్ షేర్ల లాభాలు

Dec 5 2016 12:46 PM | Updated on Sep 4 2017 9:59 PM

అమ్మ ఆరోగ్యం: తమిళ టీవీ చానల్ షేర్ల లాభాలు

అమ్మ ఆరోగ్యం: తమిళ టీవీ చానల్ షేర్ల లాభాలు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళన క్రమంలో స్టాక్ మార్కెట్లో టీవీ నెట్ వర్క్ షేర్లకు డిమాండ్ పెరిగింది.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళన క్రమంలో స్టాక్ మార్కెట్లో  టీవీ  నెట్ వర్క్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఒకవైపు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.  మరోవైపు  అమ్మకు  కార్డియాక్   అరెస్ట్ వార్తలతో  తమిళ టీవీ చానళ్ల షేర్లకు డిమాండ్‌ పెరిగింది. దాదాపు 6- 9  లాభాలమధ్య   కొనసాగుతున్నాయి.
సన్‌ టీవీ నెట్‌వర్క్‌ షేరు 6.5  రాజ్‌ టీవీ 8.8 శాతం దూసుకెళ్లాయి.   జీ ఎంటర్ టైన్ మెంట్ 2.17శాతం, టీవీ18 0.14 శాతం, డిష్ టీవీ 1.64 శాతం నష్టపోవడం గమనార్హం.
కాగా సన్‌ టీవీ అధినేత కళానిధి మారన్‌ తమిళనాడు  ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత కరుణానిధికి మారన్‌ మునిమేనల్లుడున్న సంగతి  విదితమే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement