అద్వానీతో జస్వంత్ భేటీ | Jaswant Singh meets L.K. Advani | Sakshi
Sakshi News home page

అద్వానీతో జస్వంత్ భేటీ

May 23 2014 3:44 PM | Updated on Mar 29 2019 9:24 PM

అద్వానీతో జస్వంత్ భేటీ - Sakshi

అద్వానీతో జస్వంత్ భేటీ

బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జస్వంత్ సింగ్.. ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీతో శుక్రవారం సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జస్వంత్ సింగ్.. ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీతో శుక్రవారం సమావేశమయ్యారు. జస్వంత్ మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. కాగా జస్వంత్ను పార్టీలోకి చేర్చుకునే అంశంపై భావి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినందుకు అద్వానీని జస్వంత్ అభినందించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజస్థాన్లో బార్మర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసినందుకు జస్వంత్ను బహిష్కరించిన సంగతి తెలిసిందే. జస్వంత్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement