
సీఎంకు ఈసీ నోటీసులు
జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా మఫ్తీకి ఎన్నికల కమిషన్ షోకాస్ నోటీసులు పంపించింది. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆమె ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారని అందులో పేర్కొంది.
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా మఫ్తీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులు పంపించింది. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆమె ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారని అందులో పేర్కొంది. దానికి గల కారణాలు ఏమిటో వెంటనే తెలియజేయాలని ఈసీ ఆదేశించింది. అనంత్ నాగ్ నియోజక వర్గం నుంచి మహబూబా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
జూన్ 1న ఆమె ఇందుకోసం నామినేషన్ దాఖలు చేసేందుకు కార్లో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణించిన కారులో జాతీయ జెండాలతోపాటు రాష్ట్ర జెండాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనావళి ప్రకారం అది విరుద్ధం కావడంతో ఆమెకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ శాంతమను నోటీసులు జారీ చేశారు. మరుసటి రోజే ఆమెకు నోటీసులు పంపిచినట్లు చెప్పారు.