మలప్పురంలో ఎల్‌డీఎఫ్‌ దూకుడు.. | IUML leading in Kerala Malappuram by-poll | Sakshi
Sakshi News home page

మలప్పురంలో ఎల్‌డీఎఫ్‌ దూకుడు..

Apr 17 2017 9:06 AM | Updated on Sep 5 2017 9:00 AM

మలప్పురంలో ఎల్‌డీఎఫ్‌ దూకుడు..

మలప్పురంలో ఎల్‌డీఎఫ్‌ దూకుడు..

మలప్పురం లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్‌-యూడీఎఫ్‌ తరపున బరిలోకి దిగిన పి.కె.కన్హాలికుట్టి ముందంజలో ఉన్నారు.

మలప్పురం: కేరళ రాష్ట్రంలోని మలప్పురం లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్‌-యూడీఎఫ్‌ తరపున బరిలోకి దిగిన పి.కె.కన్హాలికుట్టి ముందంజలో ఉన్నారు. కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచే కన్హాలికుట్టి ఆధిక్యం కొనసాగుతోంది. ఆయన 13వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో అధికార ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి ఎంబీ.ఫైజల్‌ ఉండగా, బీజేపీ మద్దతు ఇచ్చిన ఎన్‌.శ్రీప్రకాశ్ మూడోస్థానంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం 11 గంటలకే రిజల్ట్స్‌ వెలువడనుంది.

కాగా కేంద్ర మాజీమంత్రి ఇ. అహ‍్మద్‌ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల్లో 71.33 శాతం పోలింగ్‌  నమోదు అయిన విషయం తెలిసిందే.  మరోవైపు పినరయి విజయన్‌ అధికారం చేపట్టిన పది నెలల అనంతరం​ జరిగిన ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా 2014 ఎన్నికల్లో అహ్మద్‌ 1.94 లక్షల మెజార్టీతో గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement