తెలుగు వ్యాపారవేత్తల ఇళ్లపై ఐటీ దాడులు | Sakshi
Sakshi News home page

తెలుగు వ్యాపారవేత్తల ఇళ్లపై ఐటీ దాడులు

Published Thu, Dec 8 2016 4:33 PM

తెలుగు వ్యాపారవేత్తల ఇళ్లపై ఐటీ దాడులు - Sakshi

చెన్నై: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ దాడులు ఉధృతం చేసింది. చెన్నైలోని తెలుగు బడా వ్యాపారవేత్తల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. శేఖర్‌ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రేమ్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అన్నానగర్‌, టి. నగర్‌ సహా 8 చోట్ల సోదాలు జరిపారు. 400 కోట్ల రూపాయల విలువైన దస్తావేజులతో పాటు రూ. 90 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 70 కోట్ల నోట్లు, 20 కోట్లు పాత నోట్లు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు 100 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. కొత్త నోట్లు దొరక్క సామాన్యులు అష్టకష్టాలు పడుతుంటే వీరికి 70 కోట్ల విలువ చేసే కొత్త నోట్లు ఎలా వచ్చాయనే గురించి అధికారులు విచారిస్తున్నారు. బ్యాంకు అధికారులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. చెన్నైలో తెలుగు వ్యాపారవేత్తల నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది.



Advertisement
Advertisement