‘అది నా ప్రజాస్వామిక హక్కు’

It Is My Democratic Right To Vote In Karnataka Assembly Elections: Vijay Mallya - Sakshi

లండన్‌ : మే 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం తన ప్రజాస్వామిక హక్కు అని లిక్కర్‌ కింగ్‌, బ్యాంకులకు కోట్లాది రుణాల ఎగవేత కేసులో నిందితుడు విజయ్‌ మాల్యా అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. బ్యాంకులకు రూ వేల కోట్లు ఎగవేత కేసులో విచారణ ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న మాల్యాకు బ్రిటన్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

బ్యాంకులకు రూ 9000 కోట్లు బకాయిలు, మనీల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా రెండేళ్లుగా బ్రిటన్‌లో తలదాచుకున్నారు. కాగా, బెయిల్‌ నిబంధనల ప్రకారం తాను బ్రిటన్‌ను వీడి వచ్చే అవకాశం లేదని మాల్యా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజకీయాలను తాను ఇటీవల పరిశీలించకపోవడంతో వాటిపై వ్యాఖ్యానించలేనని చెప్పారు. మాల్యా అప్పగింత కేసు ప్రస్తుతం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో విచారణ జరుగుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top