'నా భార్యకు ఆశ ఎక్కువ' | Indrani Mukerjea si highly ambitious woman: Peter Mukerjea | Sakshi
Sakshi News home page

'నా భార్యకు ఆశ ఎక్కువ'

Mar 25 2016 11:12 AM | Updated on Sep 3 2017 8:34 PM

'నా భార్యకు ఆశ ఎక్కువ'

'నా భార్యకు ఆశ ఎక్కువ'

తన భార్య ఇంద్రాణి అత్యాశపరురాలని ఆమె భర్త పీటర్ ముఖర్జియా పేర్కొన్నారు.

ముంబై: తన భార్య ఇంద్రాణి అత్యాశపరురాలని ఆమె భర్త పీటర్ ముఖర్జియా పేర్కొన్నారు. తన కోర్కెలను నెరవేర్చుకోవడం కోసం సొంత పిల్లలను త్యాగం చేసిందని, వదులుకుందని విరుచుకుపడ్డారు. ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో రెండోసారి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ లో తొలిసారిగా భార్యకు వ్యతిరేకంగా ఆయన ఆరోపణలు చేశారు.

60 ఏళ్ల పీటర్ ముఖర్జియా షీనా బోరా హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్నారు. తన ప్రతిభాసామర్థ్యాలతో ఉన్నతస్థితికి ఎదిగి సమాజంలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న తాను ఇంద్రాణి మాయలో పడి చివరికి జైలుపాలయ్యానని బెయిల్ పిటిషన్ లో పీటర్ వాపోయారు.

2012 నాటి షీనా బోరా కేసులో వీరిద్దరితో పాటు ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామవర్ రాయ్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ  మార్చి 31న విచారణకు రానుంది. గత నెలలో పీటర్ ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement