ఇండిగో బస్సులో మంటలు | IndiGo passenger bus catches fire at Chennai airport | Sakshi
Sakshi News home page

ఇండిగో బస్సులో మంటలు

Dec 29 2017 5:27 PM | Updated on Sep 5 2018 9:47 PM

IndiGo passenger bus catches fire at Chennai airport - Sakshi

సాక్షి, చెన్నై : చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు బస్సులో అప్పుడు ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌ పోర్టు నుంచి ప్రయాణికులతో బయలు దేరిన బస్సు.. వారిని విమానం దగ్గర దించి తిరుగు ప్రయాణమైంది. విమానం నుంచి బస్సు కొద్ది దూరం ప్రయాణించగానే.. బస్సుముందు భాగం నుంచి మంటలు పైకి లేచాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలావుండగా రెండు రోజుల కిందట.. ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లాల్సిన ఇండిగో విమానం.. ఇంధన లీకేజీతో ఆగిపోయిన విషయం తెలిసిం‍దే. 

Advertisement
 
Advertisement
Advertisement