సీఎం సహాయం కోసం అత్యంత పొడగరి  | Indias Tallest Man Dharmendra Needs CM Help In UP | Sakshi
Sakshi News home page

సీఎం సహాయం కోసం అత్యంత పొడగరి 

Aug 17 2019 3:15 PM | Updated on Aug 17 2019 3:24 PM

Indias Tallest Man Dharmendra Needs CM Help In UP - Sakshi

ఆయన ప్రభుత్వం తరుపున సహాయం చేస్తానని చెప్పారు. సహాయం తప్పకుండా ...

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర సింగ్‌ అనే వ్యక్తి దేశంలోనే అత్యంత పొడగరిగా గుర్తింపు పొందారు. ఆయన ఎత్తు 8 అడుగుల 1 అంగుళం. ధర్మేంద్ర గత కొద్దిరోజులుగా తుంటి సమస్యతో బాధపుడుతున్నారు. వైద్యులను సంప్రదించగా తుంటి మార్పిడి ఆపరేషన్‌ చేయాలని, ఇందు కోసం దాదాపు రూ. 8లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేని ధర్మేంద్ర తనకు సహాయం చేయాలని సీఎం యోగిని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ధర్మేంద్ర శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవటానికి ఆయన కార్యాలయానికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేరు. దీంతో నేను వెనక్కు తిరిగిరాక తప్పలేదు. నా ఆపరేషన్‌కు కొంత సహాయం చేయాలని ముఖ్యమంత్రికి గతంలోనే లేఖ రాశాను. ఆయన ప్రభుత్వం తరుపున సహాయం చేస్తానని చెప్పారు. సహాయం తప్పకుండా అందుతుందనే నమ్మకం నాకుంది.’’ అని ఆయన అన్నారు. 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement