సినిమా, క్రికెట్‌ను భారతీయులు ఆరాధిస్తారు | indians intresting in cricket ,cinema's | Sakshi
Sakshi News home page

సినిమా, క్రికెట్‌ను భారతీయులు ఆరాధిస్తారు

Nov 21 2014 1:43 AM | Updated on Sep 2 2017 4:49 PM

సినిమా, క్రికెట్‌ను  భారతీయులు ఆరాధిస్తారు

సినిమా, క్రికెట్‌ను భారతీయులు ఆరాధిస్తారు

భారతీయులు క్రికెట్‌ను ఎంత ఆరాధిస్తారో.. సినిమాలను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని కేంద్ర మంత్రి జైట్లీ పేర్కొన్నారు.

45వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను ప్రారంభించిన అరుణ్ జైట్లీ
 
 పణజి: భారతీయులు క్రికెట్‌ను ఎంత ఆరాధిస్తారో.. సినిమాలను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని కేంద్ర మంత్రి జైట్లీ పేర్కొన్నారు. గోవా రాజధాని పణజిలో  45వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ముఖ్య అతిథిగా హాజరై భారతీయ సినిమా పరిణామంపై ప్రసంగించారు. ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డును రజినీకాంత్ అందుకున్నారు. ఈ సందర్భంగా కొంత భావోద్వేగానికి గురైన రజినీ బిగ్‌బీ పాదాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, అనుపమ్ ఖేర్, రవీనా టండన్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement