విమానంలో ఓ ముద్దు... జైలు పాలు చేసింది ! | Indian man admits to sexually touching sleeping woman on plane | Sakshi
Sakshi News home page

విమానంలో ఓ ముద్దు... జైలు పాలు చేసింది !

Sep 11 2014 9:30 AM | Updated on Aug 24 2018 4:15 PM

విమానంలో ఓ ముద్దు... జైలు పాలు చేసింది ! - Sakshi

విమానంలో ఓ ముద్దు... జైలు పాలు చేసింది !

ఆయన వయస్సు 62 ఏళ్లు... విమానంలో ప్రయాణిస్తూ... తన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టేశాడు.

న్యూయార్క్: ఆయన వయస్సు 62 ఏళ్లు... విమానంలో ప్రయాణిస్తూ... తన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా... ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి తోటి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన అమెరికాలో హ్యూస్టన్ నుంచి నెవార్క్కు యూనైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో వెళ్తుండగా చోటు చేసుకుంది.

నిందితుడి ఎన్నారై దేవేందర్ సింగ్గా గుర్తించామని... అతడి స్వస్థలం ల్యూసియానా అని చెప్పారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దేవేందర్ సింగ్కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 250,000 అమెరికన్ డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. నిందితుడు దేవేందర్ సింగ్ను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement