భారత్‌ను అడుగు పెట్టనిచ్చేది లేదు

 India NSG membership, Russia supports but China remains defiant - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : న్యూక్లియర్‌ సప్లయిర్స్‌ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వానికి మద్దతిచ్చేది లేదని చైనా మరోసారి స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి చైనా మద్దతు కూడగట్టేందుకు రష్యా కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ రబాబ్కోవ్‌ బుధవారం తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికీ చైనాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.

ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ప్రకటించేది లేదని చైనా చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో భారత్‌ను పాక్తిస్తాన్‌తో పోల్చి చూడాల్సిన అవసరం లేదని.. రష్యా పదేపదే చైనాకు చెబుతున్నా.. బీజింగ్‌ మాత్రం తన నిర్ణయం మార్చుకోవడం లేదు. భారత్‌ అణ్వస్త్ర నిరోధక చట్టంపై సంతకం చేశాక.. తమ ఆలోచన మారుతుం‍దని చైనా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఎన్‌ఎస్‌జీ సభ్యదేశాల్లో ఒక్క చైనా మినహా 47 దేశాలు భారత్‌కు అనుకూలమని ఇదివరకే ప్రకటించడం విశేషం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top