పొరుగు దేశాలకు భారత్ పెద్దన్న కాదు.. | India not a big brother | Sakshi
Sakshi News home page

పొరుగు దేశాలకు భారత్ పెద్దన్న కాదు..

Mar 6 2016 1:00 AM | Updated on Mar 29 2019 9:04 PM

పొరుగు దేశాలకు భారత్ పెద్దన్న కాదు.. - Sakshi

పొరుగు దేశాలకు భారత్ పెద్దన్న కాదు..

‘భారత్ పెద్ద దేశమే కావచ్చు. అయితే పొరుగు దేశాలకు పెద్దన్న మాత్రం కాదు. భాగస్వామి మాత్రమే’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు.

బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్
ఢాకా: ‘భారత్ పెద్ద దేశమే కావచ్చు. అయితే పొరుగు దేశాలకు పెద్దన్న మాత్రం కాదు. భాగస్వామి మాత్రమే’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. పురోగతి, శాంతి, సమృద్ధిలో భారత్, బంగ్లాదేశ్‌లు భాగస్వాములని, రెండు దేశాలు కలసి పనిచేసి, కలసి అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఢాకాలో శుక్రవారం రాత్రి జరిగిన ‘గ్రౌండ్ రూల్స్ ఆఫ్ న్యూ పారడైమ్’ అనే కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ, ‘భారత్, బంగ్లాదేశ్‌లకు గొప్ప రాజ్యాంగాలు ఉన్నాయి.

మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన అభివృద్ధి అభినందనపూర్వకంగా ఉండాలి. కలసి పనిచేద్దాం, కలసి అభివృద్ధి చెందుదాం’ అని పేర్కొన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లా ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement