ఐఐటీ బాంబేలో నాన్‌వెజ్‌పై నిషేధం తొలగింపు | Sakshi
Sakshi News home page

ఐఐటీ బాంబేలో నాన్‌వెజ్‌పై నిషేధం తొలగింపు

Published Tue, Feb 6 2018 1:43 PM

IIT-Bombay revokes ban on non-veg food items    - Sakshi

సాక్షి, ముంబయి : విద్యార్ధులు, ఫ్యాకల్టీల నుంచి తీవ్ర నిరసన ఎదురవడంతో క్యాంపస్‌లోని కేఫ్‌లో మాంసాహార వంటకాలపై నిషేదాన్ని ఐఐటీ బాంబే ఉపసంహరించింది. నాన్‌ వెజ్‌ ఐటెమ్స్‌ విక్రయంపై ఎలాంటి నియంత్రణలు లేవని..క్యాంపస్‌లోని సివిల్‌ కేఫ్‌లో తాజా ఆహారం అందుబాటులో ఉండాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తొలుత ఈ ఉత్తర్వులు జారీ చేశామని ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది. ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రాధాన్యత, వివక్ష చూపడం సంస్థ చేయబోదని స్పష్టం చేసింది.

మరోవైపు కేవలం నాన్‌ వెజ్‌ వంటకాలనే నిషేధించడం పట్ల పలువురు విద్యార్దులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవే కారణాలపై శాఖాహార వంటకాలను ఎందుకు నిషేదించలేదని వారు నిలదీశారు. ఇక క్యాంపస్‌లో నాన్‌వెజ్‌ ఐటెమ్స్‌కు పేరొందిన సివిల్‌ కేఫ్‌లో నిషేధం ఎత్తివేసిన క్రమంలో మాంసాహార వంటకాలు తిరిగి అందుబాటులోకి వస్తాయని విద్యార్థులు పేర్కొన్నారు. జనవరి 20న క్యాంటిన్‌ కమిటీ సంబంధిత కేఫ్‌ కాంట్రాక్టర్‌కు నాన్‌ వెజ్‌ ఐటెమ్‌లు అందించరాదని కోరుతూ నోటీసులు ఇచ్చింది. 

Advertisement
Advertisement