
న్యూఢిల్లీ: క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్ బుధవారం విడుదలవ్వగా ఐఐటీ–బాంబే(152), ఐఐటీ–ఢిల్లీ(182), ఐఐఎస్‌సీ–బెంగళూరు(184)లకు టాప్– 200లో స్థానం లభించింది. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఖరగ్‌పూర్, ఐఐటీ–కాన్పూర్, ఐఐటీ–రూర్కీలకు టాప్–400లో చోటు దక్కింది. క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2020ని లండన్‌లో విడుదల చేశారు. భారత్ నుంచి ఓపీ జిందాల్ టాప్–1,000లో చోటు సంపాదించిన అత్యంత కొత్త యూనివర్సిటీగా నిలిచింది. జామియా మిలియా ఇస్లామియా, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ తదితరాలకు కూడా ర్యాంకులు దక్కాయి.