ఆ ఐఐటీ దేశంలోనే టాప్‌

IIT Bombay Got Top Rank In QS Rankings For Indian Institutions - Sakshi

క్యూఎస్‌ ర్యాకింగ్స్‌-2019

ఐఐటీ - బాంబే దేశంలోనే టాప్‌

సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ కల్పనల్లో ఐఐటీ-బాంబే యూనివర్సిటీ మెరుగ్గా ఉందని క్వాక్వారెల్లి సిమండ్స్‌ (క్యూఎస్‌) ర్యాకింగ్స్‌ సంస్థ వెల్లడించింది. 2019 సంవత్సరానికి గాను దేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై నిర్వహించిన సర్వేలో ఐఐటీ బాంబే అధిక పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచిందని తెలిపింది. ఇక ఐఐఎస్సీ బెంగుళూరు సైన్స్‌ విభాగంలో టాప్‌లో నిలవగా... ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశమిచ్చే సంస్థల ప్రతిష్ట ఆధారంగా సర్వే నిర్వహించినట్టు క్యూఎస్‌ ర్యాకింగ్స్‌ తెలిపింది.

టాప్‌టెన్‌ యూనివర్సిటీలకు క్యూఎస్‌ సర్వే ర్యాంకులు ప్రకటించింది. మూడు, నాలుగు స్థానాల్లో ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ఢిల్లీ ఉండగా..  ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ కాన్పూర్‌ 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఏడో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ రూర్కే తొమ్మిదో స్థానంలో, ఐఐటీ గువాహటి పదో స్థానాల్లో ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top