29 కంపెనీల పరువు తీసేందుకు సిద్ధం | I-T Department Makes Public List of 29 Defaulters Owing Rs 448 Crore in Taxes | Sakshi
Sakshi News home page

29 కంపెనీల పరువు తీసేందుకు సిద్ధం

Mar 18 2017 1:36 PM | Updated on Oct 17 2018 4:53 PM

29 కంపెనీల పరువు తీసేందుకు సిద్ధం - Sakshi

29 కంపెనీల పరువు తీసేందుకు సిద్ధం

పన్నులు చెల్లించని కంపెనీల పరువు తీసేందుకు ఐటీ శాఖ సిద్ధమౌతోంది.

న్యూఢిల్లీ: పన్నులు చెల్లించని కంపెనీల పరువు తీసేందుకు ఐటీ శాఖ సిద్ధమౌతోంది. ఐటీ శాఖకు చెల్లించాల్సిన రూ.448.02 కోట్లను చెల్లించని 29 కంపెనీల లిస్టును శనివారం అధికారులు విడుదల చేశారు. పన్ను చెల్లించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో 29 కంపెనీల పేర్లను అడ్వర్టెయిజ్‌మెంట్ల ద్వారా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

ఆదాయపు పన్ను శాఖ గతంలో కూడా పన్ను కట్టని 67 కంపెనీల పేర్లను జాతీయ పత్రికల్లో ప్రకటించింది. వీరి నుంచి పన్ను వసూలు చేయడానికి ఆస్తులు ఏమీ లేవని ఐటీ శాఖ అధికారులు చెప్పారు. పత్రికల్లో ప్రకటన అనంతరం ఐటీ శాఖ వెబ్‌సైట్లో కూడా పన్ను ఎగ్గొట్టిన కంపెనీల పేర్లు ఉంచుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement