''సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహిస్తా..''


బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్ ఏం చెప్పినా అభిమానులకు  సెక్సీగానే ఉంటుంది. ఒకప్పుడు అడల్ట్ స్టార్ గా ఉన్న సన్నీ లియోన్.. బాలీవుడ్ స్టార్ గా మారిపోవడమే కాదు ఇటీవల కొన్ని యాడ్స్ లోనూ తనదైన రీతిలో ప్రచారం చేస్తోంది. అవాంఛిత గర్భం నుంచి తప్పించుకొనేందుకు, లైంగిక వ్యాధులు నిరోధించేందుకు, కండోమ్ ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరమంటూ.. సురక్షిత సెక్స్ పై సన్నీ లియోన్  ఫ్యాన్స్ లో స్ఫూర్తిని నింపుతోంది.సురక్షిత సెక్స్ పై నాకు ఎంతో నమ్మకం ఉందని, అందుకే నేను కండోమ్ బ్రాండ్ ప్రకటనను ఎంచుకున్నానని సన్నీలియోన్ చెప్తోంది. ప్రముఖ కండోమ్ బ్రాండ్ ప్రమోషన్ కు ఏమాత్రం సంకోచించకుండా ముందుకు వచ్చినవారిలో సన్నీలియోన్ ఒకరు. అవాంఛితన గర్భాలను నివారించేందుకు, వివిధ సుఖ వ్యాధులనుంచీ దూరంగా ఉండేందుకు కండోమ్ ను ఉపయోగించమని ఆమె తన అభిమానులను అభ్యర్థిస్తోంది. అంతేకాదు.. తాను సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహిస్తానని కూడా చెప్తోంది. కొందరు ఏ కేటగిరీ నటీమణులు కండోమ్స్ ను ప్రోత్సహించరెందుకని అడిగి ప్రశ్నకు.. అది వారి వ్యక్తిగత సౌకర్యం, స్థాయిలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. కొందరు జీవితంలో ఎదగాల్సిన పరిస్థితులు, వారి గోల్స్  కు  సంబంధించి కూడా వారు తీసుకునే నిర్ణయాలు ఉంటాయని సన్నీ చెప్పింది.ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నాని చిత్రించి, తాను స్వయంగా నటించిన ఓ ప్రత్యేక బికినీ క్యాలెండర్ ను సన్నీ లియోన్ ప్రారంభించిన సందర్భంలో సురక్షిత సెక్స్ పై ఆమె సదరు వ్యాఖ్యలు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top