భార్య మీద కోపంతో క్షణికావేశంతో ఒంటికి నిప్పంటించుకున్నాడో భర్త.
ఓటు వేయడానికి తనతో రాలేదని...
Dec 10 2015 2:41 PM | Updated on Sep 5 2018 9:45 PM
	లక్నో: భార్య మీద కోపంతో క్షణికావేశంతో ఒంటికి నిప్పంటించుకున్నాడో భర్త.  ఉత్తరప్రదేశ్ డోరియా జిల్లాలో గ్రామ  ప్రధాన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
	 
					
					
					
					
						
					          			
						
				
	స్థానికంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు రమ్మని భార్యను కోరాడు మహేంద్ర చౌహాన్. దీనికి భార్య నిరాకరించడంతో పాటు పక్కింటి మహిళతో ఓటింగ్ కేంద్రానికి వెళ్లింది. ఇది చూసి కోపోద్రిక్తుడైన మహేంద్ర భార్యపై దాడికి దిగాడు. ఆమెను  తీవ్రంగా కొట్టడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న పెద్దలు ఇద్దరినీ వారించి ఇంటికి పంపేశారు. ఇంటికి చేరిన తర్వాత మహేంద్ర ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 40 శాతం గాయాలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలోచికిత్స పొందుతున్నాడు. 
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
