జార్ఘండ్‌లో ఘోరం జరిగింది. కల్తీ మద్యం 14 మందిని బలితీసుకుంది.
సాక్షి, రాంచీ: జార్ఘండ్‌లో ఘోరం జరిగింది. కల్తీ మద్యం 14 మందిని బలితీసుకుంది. మరో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై జార్ఘండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, సూపరినెంట్ ఆఫ్ పోలీసులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారకులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ దుర్ఘటనలో రాంచీ యూనివర్సిటీ వాలీబాల్ కోచ్ అమిత్‌కుమార్‌తో పాటు మరో 13 మంది ప్రాణాలు విడిచారు. ఈమేరకు ప్రమాదానికి బాద్యుల్ని చేస్తూ దొరండా, సుఖేడోనగర్ పోలీసు అధికారులను పదవుల నుంచి తప్పించారు. ఎక్సైస్ నిబంధనలను తుంగలో తొక్కి 14 మంది మరణాలకు కారణం అయిన మద్యం మాఫియాకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. ఎక్సైజ్ అధికారులు పోలీసులతో కలిసి కల్తీ మద్యంపై ఉమ్మడిగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అయితే గతంలో కల్తీ మద్యం తయారీపై దాడలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు మద్యం మాఫియా కింగ్ గోదాముతో పాటు మద్యం నిపండానికి ఉపయోగించే రెండు లారీల ఖాళీ సీసాలను అధికారులు సీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.