
రౌడీషీటర్లకు కటింగ్ నిర్వహిస్తున్న దృశ్యం
బొమ్మనహళ్లి (కల్బుర్గి) : కల్బుర్గి జిల్లాతో పాటు తాలూకా పరిధి పీఎస్‌లలో ఉన్న రౌడీషీటర్లకు పోలీసులు పరేడ్ నిర్వహించి హెయిర్ కటింగ్ చేయించిన ఘటన ఆదివారం జరిగింది. త్వరలో జరుగనున్న టిప్పు జయంతి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్‌తో పాటు అతిగా జట్టు పెంచుకున్న వారికి కటింగ్ కూడా చేయించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని, ఒకేరోజు 900 మందికి కటింగ్ చేయించి హెచ్చరించినట్లు ఎస్‌పీ శశికుమార్ తెలిపారు.