
లార్జీ ప్రాజెక్టు అధికారులపై కేసు
లార్జీ హైడ్రోపవర్ ప్రాజెక్టు అధికారులపై కేసు నమోదు చేశారు.
మండి: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో లార్జీ హైడ్రోపవర్ ప్రాజెక్టు అధికారులపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ఇతరుల మరణానికి కారణమయ్యారనే అభియోగాలు మోపుతూ 336, 304-ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం మండి జిల్లా ఎస్పీ ఆర్ఎస్ నేగి ఈ విషయం వెల్లడించారు.
హైదరాబాద్కు చెందిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీయగా, మిగిలినవారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు.