25 కిలోల హెరాయిన్ స్వాధీనం | Heroin worth Rs 25 crore seized in Amritsar | Sakshi
Sakshi News home page

25 కిలోల హెరాయిన్ స్వాధీనం

Jul 8 2014 4:27 PM | Updated on Sep 2 2017 10:00 AM

పంజాబ్లో పెద్ద ఎత్తున్న డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.

అమృత్సర్: పంజాబ్లో పెద్ద ఎత్తున్న డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పంజాబ్ స్పెషల్ నార్కోటిక్ సెల్ పోలీసులు అమృత్సర్ సమీపంలో ని కొహాలీ గ్రామంలో డ్రగ్స్ ముఠా స్థావరంపై దాడి చేశారు. 5 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా అతని సహాయకుడు పోలీసుల నుంచి తప్పించుకుని బైక్పై పారిపోయాడు.

స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ 25 కోట్ల రూపాయిలు ఉంటుందని పోలీసులు చెప్పారు. దీన్ని పాకిస్థాన్ నుంచి అక్రమంగా రవాణా చేసినట్టు తెలిపారు. నిందితులకు పాకిస్థాన్ స్మగ్లర్లతో సంబంధాలున్నాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement