నిజానికి టోపీ వేశారు.. 

Here's the Truth Behind the Viral Photo of Nehru in an RSS Uniform - Sakshi

ఇటీవల ఆరెస్సెస్‌ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరై ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ నేపథ్యంలో భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ కూడా గతంలో ఆరెస్సెస్‌ కార్యక్రమానికి హాజరైనట్లు ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఫొటో 1939లో ఉత్తరప్రదేశ్‌లోని నైనీ అనే ప్రాంతంలో తీశారు. మరి నెహ్రూ వేసుకున్న దుస్తులు అచ్చు ఆరెస్సెస్‌ యూనిఫాం మాదిరిగానే ఉంది కదా అని  అనుకుంటున్నారా.. అయితే ఇది కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ అయిన సేవాదళ్‌ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తీసిన ఫొటో.   ఆరెస్సెస్‌ యూనిఫాం కూడా ఖాకీ నిక్కరు, తెలుపు చొక్కానే. అయితే టోపీ  నల్లగా ఉంటుంది. ఈ ఫొటోలో నెహ్రూ పెట్టుకున్న టోపీ తెలుపు రంగులో ఉంది గమనించారా. ఇది అప్పట్లో కాంగ్రెస్‌ సేవాదళ్‌ యూనిఫాం. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తీసిన చిత్రాన్ని.. ఇలా తప్పుగా సోషల్‌ మీడియాలో ప్రచారంలోకి పెట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top