ఈ పాము పాకడం లేదు.. నడుస్తోంది!

Have You ever Seen A Snake That Does Not Slither - Sakshi

న్యూఢిల్లీ : సాధారణంగా పక్షులు ఎగురుతాయి, కప్పలు గెంతుతాయి. పాములు అనేవి పాకుతాయి. ఇది అందరికి తెలుసు. కానీ పాములు నడుస్తాయి అంటే మీరు నమ్ముతారా? పాములు నడవడం ఏంటని నవ్వుకుంటారు కూడా. కానీ వీడియో చూస్తే అలా నవ్వుకోక పోగా.. ఆశ్చర్యపోతారు. ఒక పాము రోడ్డుపై పాకుతూ వెళ్లకుండా గొంగళిపురుగు మాదిరి నడుస్తూ వెళ్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘నాన్‌ స్లైడరింగ్’ పామును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ఇలాంటి పామును ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇది సైన్స్‌ ప్రయోగం కావొచ్చు. ‘ఇది గొంగళి పురుగులతో పాటు పెంచబడిన పాము కావొచ్చ’, అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి : ఈ పామును చూసైనా నేర్చుకోండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top