'వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాట్‌ల రిజర్వేషన్ల బిల్లు' | Haryana will give Jat reservations in the coming assembly sessions | Sakshi
Sakshi News home page

'వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాట్‌ల రిజర్వేషన్ల బిల్లు'

Feb 21 2016 6:30 PM | Updated on Sep 3 2017 6:07 PM

వచ్చే హర్యానా అసెంబ్లీ సమావేశాల్లో జాట్‌ల రిజర్వేషన్ల బిల్లు ఇస్తామని బీజేపీ నేత అనిల్‌జైన్‌ హమీ ఇచ్చారు.

ఢిల్లీ: వచ్చే హర్యానా అసెంబ్లీ సమావేశాల్లో జాట్‌ల రిజర్వేషన్ల బిల్లు ఇస్తామని బీజేపీ నేత అనిల్‌జైన్‌ హమీ ఇచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో హర్యానా బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అనిల్‌జైన్‌ మీడియాతో మాట్లాడారు. జాట్‌ల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని అనిల్‌జైన్‌ పేర్కొన్నారు.

కాగా, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న జాట్ల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగుతోంది.  ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement