పోలీసుల నెక్ట్స్‌ టార్గెట్‌ విపాసన | Haryana police to question Dera chairperson Vipassana Insan | Sakshi
Sakshi News home page

పోలీసుల నెక్ట్స్‌ టార్గెట్‌ విపాసన

Sep 13 2017 7:34 PM | Updated on Sep 19 2017 4:30 PM

పోలీసుల నెక్ట్స్‌ టార్గెట్‌ విపాసన

పోలీసుల నెక్ట్స్‌ టార్గెట్‌ విపాసన

అత్యాచార కేసులో గుర్మీత్‌ సింగ్‌ దోషిగా ఖరారైన అనంతరం చెలరేగిన హింసాకాండకు సంబంధించి డేరా సచా సౌధా చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు త్వరలో విచారించనున్నారు.

సాక్షి,చండీగర్‌: అత్యాచార కేసులో గుర్మీత్‌ సింగ్‌ దోషిగా ఖరారైన అనంతరం చెలరేగిన హింసాకాండకు సంబంధించి డేరా సచా సౌధా చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు త్వరలో విచారించనున్నారు. డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తదుపరి వారసురాలిగా విపాసన ఇన్సాన్‌ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. విపాసనను విచారణలో పాలుపంచుకోవాలని సిర్సా పోలీసులు త్వరలో కోరనున్నారని హర్యానా డీజీపీ బీఎస్‌ సంధూ చెప్పారు. డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.
 
డేరా వ్యవహారాల్లో కీలక వ్యక్తి ఆదిత్య ఇన్సాన్‌ సైతం ప్రస్తుతం దేశంలోనే ఉన్నారని భావిస్తున్నట్టు చెప్పారు. వీరిని పట్టుకునేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌లకు పోలీస్‌ బృందాలను పంపామన్నారు. వారు దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకునేందుకు వారిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement