breaking news
Vipassana Insan
-
పోలీసుల నెక్ట్స్ టార్గెట్ విపాసన
సాక్షి,చండీగర్: అత్యాచార కేసులో గుర్మీత్ సింగ్ దోషిగా ఖరారైన అనంతరం చెలరేగిన హింసాకాండకు సంబంధించి డేరా సచా సౌధా చైర్పర్సన్ విపాసన ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు త్వరలో విచారించనున్నారు. డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తదుపరి వారసురాలిగా విపాసన ఇన్సాన్‌ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. విపాసనను విచారణలో పాలుపంచుకోవాలని సిర్సా పోలీసులు త్వరలో కోరనున్నారని హర్యానా డీజీపీ బీఎస్ సంధూ చెప్పారు. డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. డేరా వ్యవహారాల్లో కీలక వ్యక్తి ఆదిత్య ఇన్సాన్ సైతం ప్రస్తుతం దేశంలోనే ఉన్నారని భావిస్తున్నట్టు చెప్పారు. వీరిని పట్టుకునేందుకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లకు పోలీస్ బృందాలను పంపామన్నారు. వారు దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకునేందుకు వారిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశామన్నారు. -
గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!
-
గుర్మీత్ డేరాలు: షాకింగ్ నిజాలు!
సాక్షి, సిర్సా: అత్యాచారాల కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిర్వహిస్తున్న డేరా ఆశ్రమాలకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. సిర్సాలోని డేరాలో అస్తి పంజరాలు వెలుగుచూడటం వివాదాస్పదం కాగా, దానిపై డేరా అధికార ప్రతినిధి విపాసన ఇన్సాన్ స్పందించారు. తాము గుర్మీత్ ఏర్పాటు చేసిన నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, అందులో భాగంగానే కొందరు నేరుగా ఇక్కడికి వచ్చి తమ మరణానంతరం ఇక్కడే పూడ్చిపెట్టాలని స్వచ్ఛందంగా కోరినట్లు డేరా మీడియా సచ్ కహూన్ కూడా బహిర్గతం చేసింది. డేరా ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలను ప్రశ్నిస్తే గుర్మీత్ అనుచరులైనా సరే వారిని హ్యతచేసయినా, లేక సజీవంగానైనా 600 ఎకరాలు, 100 ఎకరాలకు పైగా ఉన్న ఏదైనా ఓ డేరాలో పాతిపెట్టేవారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్మీత్ అనుచరులకు ఎదురుచెబితే ఎవరికైనా ఇక్కడ ఇలాంటి గతే పడుతుందన్న భయంతో నోరు మెదిపేవాళ్లం కాదని చెబుతున్నారు. ఛండీగఢ్ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించిన నేపథ్యంలో విపాసన మాట్లాడుతూ.. చట్టాలను డేరా ఎప్పుడూ అతిక్రమించలేదని, గుర్మీత్ అనుచరులు, మద్ధతుదారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని సూచించారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబసభ్యుల అస్థికలు తమకివ్వగా డేరాలో పూడ్చిపెట్టి, నదులు, పర్యావరణం కలుషితం కాకుండా చూసేవాళ్లమని చెప్పారు. డేరా సోదాలకు తమకు ఎలాంటి అభ్యంతర లేదని అధికార ప్రతినిధి విపాసన చెప్పగా.. మరోవైపు గురువారం రాత్రి సిర్సాకు చేరుకున్న పారా మిలిటరీ, ఆర్మీ బృందం, నాలుగు జిల్లాల పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి గుర్మీత్ నిర్వహిస్తున్న డేరాలను అణువణువు గాలిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో సిర్సాలో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారాల కేసులో దోషిగా తేలిన గుర్మీత్ కు కోర్టు 20 ఏళ్ల (ఒక్కో కేసులో పదేళ్లు) జైలు విధించిన విషయం తెలిసిందే.