ఒక్క రూపాయి నాణెం రద్దు చేశారు! | Group Of Beggars 'Demonetise' 1 Rupee Coin In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయి నాణెం రద్దు చేశారు!

Jan 8 2018 6:35 PM | Updated on Jan 8 2018 6:44 PM

Group Of Beggars 'Demonetise' 1 Rupee Coin In Uttar Pradesh - Sakshi

రాంపూర్‌ : యాచకులకు ఒక్క రూపాయి నాణెంను దానంగా వేస్తున్నారా? అయితే ఇక నుంచి వాటిని  వారు స్వీకరించరట. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో యాచకుల గ్రూప్‌ ఒక్క రూపాయి నాణెంను ఇక మీదట దానంగా అంగీకరించకూడదని నిర్ణయించింది. ఈ నాణెంను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసినట్టుగానే, ఇక మీదట తాము కూడా ఒక్క రూపాయి నాణెంను రద్దు చేస్తున్నామని, దీని సైజు 50 పైసల మాదిరి ఉందని యాచకుడు శుక్ర మని చెప్పాడు. ఈ కాయిన్లను తమ వద్ద నుంచి స్వీకరించవద్దని దుకాణాదారులకు, రిక్షావారిని కూడా కోరినట్టు యాచకులు చెప్పారు. ఇక నుంచి యాచకులకు ఎవరు దానం చేయాలన్న ఒక్క రూపాయి కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement