జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి టెలికాం సంస్థలపై గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు. శ్రీనగర్లోని వోడాఫోన్ టవర్ పై గ్రెనైడ్లు విసిరారు. ఎయిర్ సెల్ షో రూంను ధ్వంసం చేశారు.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు శుక్రవారం మరోసారి టెలికాం సంస్థలపై గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు. శ్రీనగర్లోని వోడాఫోన్ టవర్ పై గ్రెనైడ్లు విసిరారు. ఎయిర్ సెల్ షో రూంను ధ్వంసం చేశారు. టెలికాం సంస్థలను టార్గెట్ చేసిన మిలిటెంట్లు కమ్యూనికేషన్ వ్యవస్థను స్థంభింప చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో టెలికాం సేవలు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గతంలో కూడా జమ్ము కశ్మీర్లో లష్కరే తోయిబా మిలిటెంట్లు టెలికాం సంస్థలపై దాడి చేశారు. దాదాపు 50 టవర్లను కూల్చి వేశారు. ఒక వ్యక్తిని హతమార్చారు. టెలికాం సంస్థలను మూసివేయాలని, కార్యక్రమాలను మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పోస్టర్లు కూడా విడుదల చేశారు. సైనికులకు సహకరిస్తున్న కశ్మీర్ లోయలోని ప్రజలను నిరోధించడానికే మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారని సైనిక అధికారులు చెబుతున్నారు.