
'వారి స్నేహం నిలవదు.. బద్దలవడం ఖాయం'
బిహార్లో గ్రాండ్ అలయెన్స్ ఎంతో కాలం కోనసాగదని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. త్వరలోనే ఈగోల కారణంగా జేడీయూ, ఆర్జేడీ స్నేహం చెదిరిపోతుందని, అవి విడిపోతాయని, మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
పాట్నా: బిహార్లో గ్రాండ్ అలయెన్స్ ఎంతో కాలం కోనసాగదని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. త్వరలోనే ఈగోల కారణంగా జేడీయూ, ఆర్జేడీ స్నేహం చెదిరిపోతుందని, అవి విడిపోతాయని, మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఆర్జేడీ ఆలోచనలు వేరని, జేడీయూ ఆలోచనలు వేరని ఆరెండు ఎక్కువకాలం కొనసాగబోవని అన్నారు.
బిహార్ ఎన్నికల్లో ఓటమిపాలుకావడానికి గల కారణాలు శోధించేందుకు ఆయన తన నియోజకవర్గంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అనుకోని విధంగా గ్రాండ్ అలయెన్స్ వైపు గాలిమళ్లిందని అన్నారు. నియోజకవర్గాల వారిగా అది గెలుపులు దక్కించుకున్న ఓట్ల విషయంలో ఎన్డీయేకన్నా తక్కువ స్థాయిలోనే సాధించాయని చెప్పారు. త్వరలోనే ఈ గ్రాండ్ అలయెన్స్ కు బీటలు వారనుందని, అది మీరు తప్పక చూస్తారని, మధ్యంతర ఎన్నికలు కూడా వస్తాయని చెప్పారు.